PS Telugu News
Epaper

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

📅 23 Feb 2026 ⏱️ 6:27 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి ఫిబ్రవరి 23, 2026: భారతమండపం లో నిర్వహించిన ఏఐ

సమ్మిట్ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అల్లర్లు సృష్టించిన ఘటనను ఖండిస్తూ, అమలాపురం గడియారస్థంభ సెంటర్ వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు గాణాల కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు వ్యక్తం చేయాలని, అల్లర్లు సృష్టించడం తగదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా, బీజేపీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, రాష్ట్ర యువ మోర్చా అధికార ప్రతినిధి గణిశెట్టి అరవింద్, రాష్ట్ర యువ మోర్చా కార్యదర్శి రుద్రరాజు నరేంద్ర వర్మ, ద్రాక్షారామ మండల యువమోర్చా అధ్యక్షుడు తోలేటి సూర్య, కొండేటి జయలక్ష్మి, నల్లా సత్తిబాబు, అరిగెల నాని, గాణాల సాయి, షాధిక్, అరిగేల తేజ వెంకటేష్, గోకరకొండ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top