రుద్రూర్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు….
రుద్రూర్, డిసెంబర్ 24 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ గ్రామ సర్పంచ్ గా ఇందూరు సునీత – ఇందూర్ చంద్రశేఖర్ మూడవ సారి ఎన్నికైన సందర్భంగా రుద్రూర్ గ్రామంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీక్ చైర్మన్ తహెర్ బీన్ అందాన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ జిల్లా మేయర్ సుజాత, నిజామాబాద్ జిల్లా మాజీ మేయర్ సంజయ్, డిసిసి నూతన అధ్యక్షులు కాట్పల్లి నగేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీక్ చైర్మన్ తాహెర్ బీన్ అందాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రుద్రూర్ సర్పంచ్ గా ఇందూరు సునీత – ఇందూరు చంద్రశేఖర్ ను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించినందుకు గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు పార్టీని చూసి ఓటు వేయలేదని వ్యక్తిని చూసి ఓటు వేశారని వారు స్పష్టం చేశారు. ప్రజలకు పింఛన్లు, రేషన్ కార్డులు, తదితర పథకాలను మంజూరు చేసేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అండగా ఉన్నారని అన్నారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన నాయకులు గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత- చంద్రశేఖర్ ను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డ్ మెంబర్లు, వివిధ మండలాల నాయకులు, పార్టీ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.