రుద్రూర్ సర్పంచ్ గా ఇందూరు సునీత ప్రమాణ స్వీకారం…
రుద్రూర్, డిసెంబర్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ గ్రామ నూతన సర్పంచ్ గా ఇందూరు సునీత, ఉప సర్పంచ్ గా షేక్ నిస్సార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 13 మంది వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. గ్రామస్థుల సహకారంతో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, రుద్రూర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, గ్రామస్థులు, నాయకులు పాల్గొని నూతన ప్రతినిధులను అభినందించారు. అదేవిధంగా మండలంలోని చిక్కడపల్లి, రాయకూర్, రాణంపల్లి, రాయకూర్ క్యాంప్, కొందాపుర్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్, సిద్దాపూర్, బొప్పాపూర్, అంబం(ఆర్) గ్రామాలల్లో గ్రామ సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
