రూ.150 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజి 117 గేట్ల ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రయనించే సూర్యుడు జూలై 13ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధినానాజీ : గోదావరి డెల్టా రైతాంగాన్ని ఆదుకుంటున్న రైతు బాంధవులు ముఖ్యమంత్రి చంద్రబాబు… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఎమ్మెల్యే బండారు సత్యానందరావు…ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాతగా, రైతు పక్షపాతిగా, అధికారం అంటేనే బాధ్యతగా పేద ప్రజలకు సేవ చేయడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రశంసించారు. ధవలేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 117 నూతన గేట్ల ఏర్పాటు, మరమ్మత్తు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం ఈ ప్రాంత రైతులు చేసుకున్న అదృష్టమని ఎమ్మెల్యే బండారు కొనియాడారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పిచ్చుకలంకలో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి సభలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, ఎంపీ హరీష్ మాధుర్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, తన సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు ప్రసంగిస్తూ రైతు ఇరిగేషన్ శాఖామంత్రిగా ఉంటే ఆ శాఖ అద్భుతమైన పనితీరు కనబరుస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ప్రత్యేకంగా ప్రశంసించారు. నాడు కాటన్ మహాశయుడు సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు అన్నం పెడితే,ఈ బ్యారేజీని కాపాడటానికి నేనున్నాను అంటూ 117 గేట్ల ఆధునికీకరణ పనులు రూ.150 కోట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారని, ఈ ప్రాంత ప్రజల పట్ల రైతుల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనమన్నారు. వైసిపి గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో బ్యారేజ్ గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదని, బేరింగ్లు కూడా బిగించలేదని, చిన్న చిన్న మరమ్మత్తులు కూడా చేపట్టకపోవడంతో బ్యారేజీ అస్తిత్వమే ప్రమాదంలో పడిందన్నారు. ఈ అంశాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యారేజీకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, గోదావరి డెల్టా రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఆలోచనతో బ్యారేజీ ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమతో కృష్ణ డెల్టాకు ఊపిరి పోసారన్నారు. వెలుగోడు నిర్వాసితులకు పరిహారం అందజేసారన్నారు. పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నారని ప్రశంసించారు. నీటిపారుదల రంగానికి, రైతుల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ఐదేళ్ల గొడ్డలి పార్టీ పరిపాలనలో రాష్ట్రంలో చేసిన ఆర్థిక అని విధ్వంసాన్ని, అరాచకాలను సరిదిద్దడానికి తన అపారమైన అనుభవంతో అనునిత్యం ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని, రాష్ట్రాన్ని చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. సెంట్రల్ డెల్టాను కాపాడడానికి లొల్ల లాకుల పునర్నిర్మాణానికి నిధులు కోరితే వెంటనే రూ.74.20 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అభివన కాటన్ దొరలా, అపర భగీరథునిలా గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు సైతం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కాటన్ ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను కాపాడే శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబుకి మాత్రమే ఉందన్నారు. బిందు సేద్యం, ప్రకృతి సేద్యం, వ్యవసాయ ఆధునికీకరణ అన్నదాత సుఖీభవ మొదలైన పథకాలతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే బండారు కోరారు. అలాగే పిచ్చుకలంకను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఏటిగట్ల బలోపేతానికి నిధులు కేటాయించాలని, నదీపాత నివారణకు, కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయ నిర్మాణానికి వ్యవసాయ మార్కెట్ కు సంబంధించిన స్థలం కేటాయింపు, కొత్తపేట ఎమ్మార్వో కార్యాలయం నిర్మాణానికి నిధుల కేటాయింపు, వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.పేరూరు వై జంక్షన్ నుంచి రావులపాలెం జాతీయరహదారి వరకూ మధ్యలో ప్రతిపాదించిన జాతీయ రహదారిని త్వరితగతిన అభివృద్ధి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి ఈ పనులన్నీ చేపడతానని సానుకూలంగా స్పందించారు.