PS Telugu News
Epaper

రెంట్ కోసం వెళ్లి తిరిగి రాని ఓనర్.. ఆలస్యంగా బయటపడిన భయంకర నిజం

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా రెంట్ అడగడానికి వచ్చిన ఓనర్‌కి.. మన దగ్గర రెంట్ లేకపోతే ఏం చెబుతాం.! రెండు లేదా మూడు రోజుల్లో చూసి రెంట్ ఇచ్చేస్తాం. లేదా ఇదిగో రెంట్ అని పట్టుకొచ్చి డబ్బులు ఇస్తాం. కానీ ఇక్కడొక జంట.. కిలాడీ భార్యాభర్తలు ఏం చేశారో తెలిస్తే..! వివరాల్లోకి వెళ్తే.. రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్‌ను చంపి.. సూట్‌కేసులో కుక్కిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓరా కైమోరా సొసైటీలో దీపశిఖ శర్మ ఫ్యామిలీకి రెండు ఫ్లాట్లు ఉన్నాయి. ఒకదానిలో వీరు నివాసం ఉంటుండగా.. రెండో ఇంటిని ఆకృతి-అజయ్ అనే ఇద్దరు భార్యాభర్తలకు అద్దెకు ఇచ్చింది. నాలుగు నెలలుగా ఆ భార్యభర్తలు రెంట్ ఇవ్వకపోగా.. దాన్ని వసూలు చేసేందుకు దీపశిఖ బుధవారం సాయంత్రం వాళ్ల దగ్గరకు వెళ్ళింది. రాత్రి వరకు తిరిగిరాలేదు. పనిమనిషికి అనుమానమొచ్చి ఆ ఇంటి దగ్గరకు వెళ్లి చూడగా.. దీపశిఖ సూట్‌కేసులో శవమై కనిపించింది. దీంతో పనిమనిషి వెంటనే పోలీసులకు సమాచారాన్ని ఇచ్చింది. సమాచారాన్ని అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. ఏడాది క్రితమే ఆకృతి-అజయ్ ఆ ఫ్లాట్‌లోకి దిగినట్టు పోలీసులు గుర్తించారు. దీపశిఖ కుటుంబసభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డులు, ఆర్ధిక వ్యవహారాలు లాంటివి ఈ హత్యకు దారి తీశాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Scroll to Top