PS Telugu News
Epaper

రైతన్న మీకోసం వారోత్సవాలు

📅 16 Mar 2026 ⏱️ 4:57 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ప యనించే సూర్యుడు మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రైతన్న మీకోసం వారోత్సవాలు” ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించటం జరుగుతున్నది.ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల వ్యవసాయ అధికారి బి.మృదుల, మండల తహసిల్దార్ రవికిరణ్ , ఫిషెరీ ఆఫీసర్ వారు మరియు గ్రామ స్థాయిలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు కాట్రేనికోన గ్రామములో రైతుల ఇళ్లకు వెళ్లి ప్రత్యక్షంగా కలుసుకుని పంటల స్థితి, వ్యవసాయ సమస్యలు, సూచనలు తెలియ జేశారు. అలాగే రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ పరిస్థితులు, పంటల సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.
రైతు సేవా కేంద్రాల అధికారులు కార్యక్రమంలో ప్రతి రోజు గ్రామాల్లో రైతుల ఇళ్లను సందర్శిస్తూ వారి సమస్యలను నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు.అదేవిధంగా ఫార్మర్ ఐడి నమోదు, ఈ-పంట వివరాలు, డిజిటల్ వ్యవసాయ సేవలు పై కూడా రైతులకు వివరించడం జరిగింది. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వంటి పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సూచనలు రైతులుకు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేకొని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని మండల వ్యవసాయ అధికారి వారు తెలిపారు.. వ్యవసాయ శాఖ

Scroll to Top