PS Telugu News
Epaper

రైతన్న మీకోసం వారోత్సవాల్లో ముఖ్యఅతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల

📅 17 Mar 2026 ⏱️ 7:15 PM 📝 HOME
Listen to this article

పయ నించే సూర్యుడు మార్చి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రైతన్న మీకోసం వారోత్సవాలు” డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన లో ఈరోజు ఈ నెల 16 నుంచి 25 వరకు జరుగు కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ముమ్మిడివరo నియోజకవర్గo ప్రభుత్వ విప్ మరియు శాసన సభ్యులు దాట్ల బుచ్చిబాబు పాల్గొనడం జరిగింది. ఈ కార్య క్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసన సభ్యులు వారు వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి ప్రత్యక్షంగా కలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ పరిస్థితులు, పంటల సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతున్నది అని అదేవిధంగా ఫార్మర్ ఐడి నమోదు, ఈ-పంట వివరాలు, డిజిటల్ వ్యవసాయ సేవలు గురుంచి చెప్పటం జరిగినది. కావున రైతులు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందాలని చెప్పటం జరిగినది. ఈ కార్యకమంలో మండల వ్యవసాయ అధికారి బి.మృదుల, మండల తహసిల్దార్ రవికిరణ్ , ఫిషెరీ ఆఫీసర్ చలపతి మరియు కాట్రేనికోన వ్యవసాయ మరియు అనుబంధ శాఖల గ్రామ స్థాయి అధికారులు మరియు నాయకులు నాగిడి నాగేశ్వర రావు , విత్తనాల బుజ్జి , శీలం సూర్యనారాయణ గారు, , పీఎస్ఎన్ రాజు ఏఎంసి ఛైర్మన్ ఒగూరి భాగ్యశ్రీ గారు ఇతర నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.వసాయ అధికారి , కాట్రేనికోన

Scroll to Top