రైతులకు పట్టాదారు పాస్ బుక్ పంపిణీ

August 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 2 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామంలో రీ సర్వే కార్యక్రమంలో భాగంగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ బుక్ లను పంపిణీ చేశారు. మండల తహసీల్దార్ రవి కిరణ్, సమక్షంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు నాగిడి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా డిసి చైర్మన్ ఆకాశం శ్రీను, సొసైటీ అధ్యక్షులు నూకల మూర్తి, కాలాడి వీరబాబు తదితరులు హాజరై రైతులకు పాస్ బుక్ లను అందజేశారు. గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే వల్ల రైతులకు భూరికార్డులపై స్పష్టత వస్తుందని, పట్టాదారు పాస్ బుక్ లు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నాయకులు అన్నారు. రైతులు తమ భూముల వివరాలను సక్రమంగా కలిగి ఉండేందుకు ఈ పాస్ బుక్ లు దోహదపడతాయని తెలిపారు. రీ సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ప్రతి రైతుకు పాస్ బుక్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

🌐 Select Language:
📰 ePaper