PS Telugu News
Epaper

రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి…

📅 25 Aug 2025 ⏱️ 1:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

(సూర్యుడు దౌల్తాబాద్ 25)

దౌల్తాబాద్ మండల కేంద్రంలోని, రైతు వేదిక వద్ద సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పరుగులు పెడుతూ పడిగాపులు

ఉదయాన్నే కడుపు మార్చుకొని యూరియా కోసం ఎగబడిన రైతులు

దౌల్తాబాద్: తెల్లారింది మొదలు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్ లో నిలుచున్న యూరియా దొరకకపోవడం కష్టంగా మారింది. ప్రస్తుతం వరి నాట్లు పూర్తయ్యాయి. మొక్కజొన్నకు రెండోదప యూరియా వేసే సమయం వచ్చింది. యూరియా అత్యవసరమైంది. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శుక్రవారం రైతు వేదిక వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం పొద్దున్నే లేచి కడుపు మార్చుకొని వచ్చి పరుగులు పెడుతూ బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. ఇలా వారం నుంచి కొంతమంది రైతులు తిరుగుతున్న యూరియా దొరకడం గగనంగా మారిందని పంటలకు యూరియా వేసే తరుణంలో ప్రభుత్వం నిబంధనలు విధించి ఒక రైతుకు ఒక యూరియా బస్తా ఇవ్వడం ఏంటని రైతులు మండిపడుతున్నారు. మండలానికి సరిపడా యూరియా అందించి రైతులు సాగుచేసిన పంటలను కాపాడుకునేటట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని, అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Scroll to Top