రైతులు సాగు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలి
జిల్లా వ్యవసాయ అధికారి దనసరి పుల్లయ్య
పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి దనసరి పుల్లయ్య సందర్శించారు. రైతులు సాగు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని సూచన ఇచ్చారు.. మంగళవారం రాంనగర్ తండాలో పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పంటలపై విచక్షణారహితంగా ఎరువులు, పురుగుమందులను వాడవద్దని తెలిపారు.పంట కాలం అనంతరం అవశేషాలు తగలబెట్టకుండా నేలలో కలయ దున్నడం వల్ల నేలకు పోషకాలు అందుతాయని , కార్బన్ శాతం పెరుగుతుందని తెలిపారు. అనంతరం ఏన్కూరు రైతు వేదికల రైతు నేస్తం ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మండలంలో వచ్చే వాన కాలం పత్తి మిరప గింజలను అధికృత డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని తెలిపారు. అనుమతి లేకుండా, అక్రమంగా నిలువ ఉంచిన, విక్రయించిన అనాధికారిక హెచ్ టి పత్తి విత్తనాలపై కటిన చర్యలు తీసుకుంటామని తెలిపినారు. విత్తనాలు, ఎరువులు తనిఖీ చేయుటకు టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లా, మండల, గ్రామస్థాయిలో ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ నరసింహారావు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
