PS Telugu News
Epaper

రైతు సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదoడరెడ్డి

📅 08 Jan 2026 ⏱️ 7:15 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 08/01/26

గాంధారి మండల కేంద్రంలోని పోడు భూముల రైతుల సమస్యల పరిష్కరించడం కోసం పోడు భూముల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జిల్లాలోని పోటు భూముల రైతులతో గాంధారి మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకుఎదురవుతున్న ఇబ్బందు లను తెలపాలని ఆయన కోరగా చాలామంది రైతులు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులను ఇక్కడ ఏర్పాటు చేసిన పది కౌంటర్లో ఇవ్వాలని అధికారులు సూచించారు ఈ సందర్భంగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నుండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుల కోసమే పని చశాయని ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోవడం చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని ఇందిరాగాంధీ ప్రభుత్వం పేద ప్రజలకు భూములు పంపిణీ చేసిందని, వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రైతులకు ఉచిత విద్యుత్ రుణమాఫీ , జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పుడు తెలంగాణలో ఉన్న రేవంత్ ప్రభుత్వం అనుక్షణం అనునిత్యం రైతుల సంక్షేమ కోసమే పాటుపడుతుందని రైతుల భూ సమస్యలు పరిష్కరించడం కోసం ధరణి అనే వ్యవస్థను తీసివేసి భూభారతి పథకం ద్వారా రైతులకు తక్షణం భూ సమస్యలు పరిష్కారం చూపుతుందని పోడు భూముల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ పోడు భూముల సమస్యల పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పోడు భూముల ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆయన అన్నారుపోడు భూముల సమస్యలపై పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్, గాంధారి మండల అధ్యక్షుడు బొట్టు మోతిరం నాయక్, తదితరులు పాల్గొన్నారు

Scroll to Top