PS Telugu News
Epaper

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే దాట్ల

📅 18 Mar 2026 ⏱️ 1:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 17 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

కాట్రేనికోన: రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్న మీకోసం వారోత్సవాలు ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహిస్తోందని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు అన్నారు. రెండో రోజు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కాట్రేనికోన ఎమ్మెల్యే పాల్గొన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి ప్రత్యక్షంగా కలుసు కుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆధునిక వ్యవసాయ పద్ధ తులు, మార్కెట్ పరిస్థితులు, పంటల సంరక్షణ తదితర అంశాలపై అదగా హన కల్పిస్తారని ఆదోవిధంగా ఫార్మర్ బడి నమోదు, ఈ-పంట వివరాలు , డిజిటల్ వ్యవ సాయ సేవలను వ్యవసాయ అధికారులు వివరిం చారు. రైతులు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ, రాష్ట్ర టిడిపి కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు, అన్వీ బోర్డు డైరెక్టర్ విత్తనాల బుజ్జి, టిడిపి నాయకులు పిఎన్ఎన్ రాజు, మండల వ్యవసాయ అధికారిని మృదుల, మండల తహసిల్దార్ రవికిరణ్, ఫిషరీ ఆఫీసర్ చలపతి, నాయకులు, జంగా శ్రీనివాస రావు, శీలం సూర్యనారాయణ, మోకా అప్పాజీ, రైతులు పాల్గొన్నారు. ఏటిగట్లు నిర్మించి పటిష్ట పరుస్తాం:మండలంలోని తీర ప్రాంత సమీపంలో ఉన్న వరిచేలు సముద్రపు నీరు పోటు సమయంలో ముంపు భారి పడకుండా ఏటిగట్ల ఎత్తు పెంచి పటిష్ట పరుస్తామని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం కాట్రేనికోన శివారు ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పంట నష్టాలు రాకుండా ఆదుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. పాడైపోయిన షట్టర్ ప్రాంతంలో కొత్త పటర్లను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఏటుగట్టు నిర్మాణానికి రెండు కోట్లు మంజూరు చేశామని, అది పూర్తి అయిపోయిన తర్వాత పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేయడానికి మరో 10 కోట్లు తీసుకొస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఏటిగట్టు ఆక్రమణలను తొలగించి హెడ్ వర్కు
అప్పచెప్పాలని తాసిల్దార్ రవి కిరణ్ ని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం సత్తెమ్మ చెట్టు ప్రాథమిక పాఠశాలకు వెళ్లి పిల్లలకు పెడుతున్న ఆహారాన్నిపరిశీలించారు. అక్కడ అన్నం కూరలను రుచి చూసిన ఎమ్మెల్యే దాట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కాట్రేనికోన హైన్యూల్లో ఆసంపూర్తిగా నిలిచిపోయిన స్కూలు భవనాలను పరిశీలించారు. వెంటనే వాటి నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు, మండల టిడిపి అధ్యక్షుడు చెల్లి సురేష్, నీటి సంఘం డైరెక్టర్ వాసంశెట్టి రాజేశ్వరరావు, కాట్రేనికోన సొసైటీ డైరెక్టర్ మోడా అప్పాజీ, మండల టిడిపి యూత్ అధ్యక్షుడు వంగా దుర్గ బాబు, టిడిపి నాయకులు పచ్చమట్ల సూర్యనారాయణ రాజు, కాండ్రేగుల సత్య ప్రసాద్, వనచర్ల నాగేశ్వరరావు, రీలం సూర్యనారాయణ, జంగా శ్రీనివాసరావు, బండారు ఏసు, వల్ల రామకృష్ణ, గుత్తుల సూరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Scroll to Top