రైతు సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 31 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
రైతు సంఘం నూతన మండల కమిటీని సిపిఐ సీనియర్ నాయకులు వీకే ప్రదీప్ రెడ్డి అధ్యక్షతన రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు యాదవ్ సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శి శ్రీరాములు ఓబిరెడ్డి సిపిఐ సీనియర్ నాయకులు నీలూరు లక్ష్మయ్య సమక్షంలో రైతు సంఘం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. శనివారం మండలంలోని వేములపాడు గ్రామంలో వికే వారి నివాసంలో రైతు సంఘం మండల అధ్యక్షుడిగా చిట్టెం రెడ్డి రంగారెడ్డి, ఉపాధ్యక్షునిగా హనుమంతరామ చౌదరిని సెక్రెటరీగా రామ సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీగా ఆదినారాయణ రెడ్డి రైతు సంఘం సభ్యులుగా హాజీవలి, ఇబ్రహీం ,చిన్నపుల్లారెడ్డి పెద్ద కుల్లాయి రెడ్డి పెద్ద పుల్లారెడ్డి ఆవుల ప్రసాద్ మారుతి ప్రసాద్ మల్లికార్జున విశ్వనాధ్, గిరి ఎన్నుకున్నారు, ఈ సందర్భంగా చిట్టెం రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ మండలంలోని రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు,
