రోడ్డు వెడల్పుతో డ్రైవర్ల ఆనందం
చప్పిడి సోదరులకు కృతజ్ఞతలు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 కడప డిస్ట్రిక్ట్ టి సుండుపల్లి మండలం
మండల కేంద్రంలో ఆర్ అండ్ బి రోడ్డు ఆక్రమణకు గురై ఒక వాహనం వస్తే మరొక వాహనం వెళ్లే దానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో సుండుపల్లి మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి మహేష్ నాయుడు సొంత నిధులతో ప్రధాన మురికి కాలువ ఆక్రమణలు తొలగించడంతోపాటు కాలవ లోని చెత్తాచెదారం రాళ్లు రప్పలు ట్రాక్టర్లలో తరలించారు దీంతో 20 అడుగులు కూడా లేని రోడ్డు దాదాపు 40 అడుగులు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్లతోపాటు స్కూల్ బస్సు ఆటో డ్రైవర్లు ద్విచక్ర వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఇలా రోడ్డు పనులు ఒకపక్కనే కాకుండా మరొక సైడు కూడా ఆక్రమణలు తొలగించి రోడ్డు వెడల్పు చేసి వాహనదారుల ఇబ్బందులు పట్టించుకోవాలని పలువురు కోరుతున్నారు ఒకపక్క పూర్తిస్థాయిలో కాలువ వరకు అడ్డంకులు లేకుండా చూడాలని అలాగే మరోవైపు ఉన్న అంగళ్ళ ముందర ఆక్రమణ తొలగించి పుణ్యం కట్టుకోవాలని పలువురు కోరుతున్నారు