లక్ష్యసాధకులతో లక్ష్యసాధక్”
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ
జిల్లా స్థాయిలో నిర్వహించే “లక్ష్యసాధక్” కార్యక్రమాన్ని ఆవిష్కరించిన గౌరవ కలెక్టర్ మరియు గౌరవ ఎస్ పి గారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మరియు రాస్తున్న వారికి జిల్లావ్యాప్తంగా “లక్ష్యసాధక్ టాలెంట్ హంట్ ఎగ్జామ్” పోటీని ఉచితంగా నిర్వహిస్తున్నామని SSRLTL – CEO సాంబశివరావు పేర్కొన్నారు. అదే రోజు పరీక్ష రాసిన వారిని ఉద్దేశించి, యుపిఎస్సి లాంటి అత్యున్నత పరీక్షల్లో విజయం సాధించిన ఐఏఎస్, ఐపీఎస్ అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు వారి యొక్క అమూల్యమైన ఇన్స్పిరేషన్ సందేశాన్ని అందించే కార్యక్రమం “ఇన్స్పైర్ ఫ్రం ఎచీవర్స్ – ఇగ్నైట్ యువర్ గోల్ ” అని తేలిపారు.ఈ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్ నందు గౌరవ కలెక్టర్ మహేష్ కుమార్ గారు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ లక్ష్యం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలని అన్నారు.స్థానిక ఎస్పీ కార్యాలయం నందు గౌరవ ఎస్ పి రాహుల్ మీన గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ లక్ష్యసాధనలో వచ్చే అడ్డంకులను ధైర్యంతో ఎదుర్కోవాలనీ, ఇటువంటి కార్యక్రమాలు ధైర్యాన్ని నింపడానికి ఉపయోగపడతాయని అన్నారు. నిర్వాహకులను అభినందిస్తూ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు.ముమ్మిడివరం డీఈవో కార్యాలయం నందు DEO నాగేశ్వరరావు గారు మరియు డిసిసిబి సెక్రటరీ హనుమంతరావు గారు విద్యార్థుల్లో అవగాహనను, సరైన పోటీ తత్వాన్ని పెంచడమే కాకుండా మానసికంగా అభివృద్ధిపరిచే ఇటువంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు.ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం ఈ కార్యక్రమాల్లో స్థానిక అమలాపురం స్థానిక సివి రామన్ స్కూల్ వేదికగా నిర్వహిస్తున్నామని బ్రెయిన్దెమ్ సీఈవో శాంతి స్వరూప్ తెలిపారు. అదే రోజున రామాయణ భాగవత భగవద్గీత మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ తెలుగు సబ్జెక్టుల నందు జిల్లావ్యాప్తంగా విద్యార్థులకు” ఎకడమిక్ అండ్ ఎపిక్ నాలెడ్జ్ టాలెంట్ హంట్ ” పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నామని, దీనిని తిరిగి రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తామని, మొదటి ద్వితీయ తృతీయ బహుమతులుగా 12 లాప్టాప్ లు అందిస్తున్నామని శాంతిస్వరూప్ తెలిపారు.వివరములకు 8919050676 నెంబర్ను సంప్రదించాలని కోరారు.
