
గోశాలలో గోవులకు దాన వితరణ చేస్తున్న లయన్స్ ప్రతినిధులు…
రుద్రూర్, జూలై 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
లయన్ స్టిక్ సంవత్సరంలో మొదటి రోజుని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో మంగళవారం వివిధ గ్రామాలల్లో 10 సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో దాదాపు 150 మందికి ఉదయం తహసీల్దార్ కార్యాలయం వద్ద అల్పాహారాన్ని అందించడం జరిగింది. అనంతరం దేవిదాస్ రావు గోశాలలో గోవులకు దాన వితరణ చేశారు. తదుపరి వీధి శూనకాలకు ఆహారం అందించడం జరిగింది. అనంతరం మంతెన సత్యనారాయణ రాజు నేచర్ క్యూర్ ఆసుపత్రిలో 11 మొక్కలను నాటారు. యోగా హాల్లో రోగులకు యోగ అవగాహన కార్యక్రమం, మధుమేహ వ్యాధి అవగాహన కల్పించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న ఐదుగురి డాక్టర్లకు డాక్టర్స్ డే సందర్భంగా సన్మానించారు. అనంతరం రుద్రూర్ అంగడి బజార్ లో ఉన్న రెండు అంగన్వాడి సెంటర్లలో పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు కే.వి.మోహన్, కార్యదర్శి లయన్ ప్రశాంత్ గౌడ్, సభ్యులు శ్యాంసుందర్ పహాడే, ప్రవీణ్, కారంగుల పుట్టి సాగర్, శామీర్, తొక్కి మహేందర్, కారంగుల ప్రవీణ్ కుమార్, తాహెర్, గాండ్ల మధు, గెంటిల గంగాధర్, కటికే రామ్ రాజ్, శ్రీకాంత్ గౌడ్, మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం కార్యదర్శి యోగ సాయిలు, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
