లాల్ జీవితం…..ప్రజా సేవకు అంకితం….
మండల ప్రజలు మెచ్చిన మనిషి
సతీసమేతంగా ప్రజాసేవకే వారి జీవితం
రాష్ట్రంలో ఉత్తమ గ్రామపంచాయతీ చేయడమే ఆయన లక్ష్యం
నేడు సర్పంచిగా ప్రమాణస్వీకారం చేసిన లాల్
పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 22:
అశ్వాపురం గ్రామపంచాయతీలో తనదైన ముద్ర వేసుకొని ప్రజా సేవకే తన జీవితం అంకితం చేసుకొని, అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సతీమనీ శారదా లాల్ పనిచేసిన తర్వాత అశ్వాపురం గ్రామపంచాయతీ అభివృద్ధి గురించి లాల్ కు ముందు తర్వాత అనే విషయం చెప్పుకునే పరిస్థితుల్లో మండల ప్రజలు ఉన్నారు.వృద్ధాప్యంలో కూడా చిరునవ్వుతో ప్రజలను ప్రేమ పూర్వకంగా పలకరిస్తూ ప్రజల కోసం,గ్రామం కోసం,గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ సతీసమేతంగా వారి జీవితం ప్రజలతో ప్రజలకే అంకితం అనుకుంటూ ప్రజా సేవలో తన సతీమణి వెనుక నుండి గ్రామ అభివృద్ధిలో తనదైన పాత్ర వేసుకొని మరొకమారు ఇదే అశ్వాపురం గ్రామపంచాయతీకి సర్పంచ్ ఎన్నికైన బానోత్ సదర్ లాల్ నేడు అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ఉద్యోగంలోనూ ట్రేడ్ యూనియన్లలో ప్రజాసేవలో వారికి చేసిన సేవలను కొనియాడుతూ రాసిన కథనం
పలు యూనియన్లకు నాయకునిగా ఆయన చేసిన సేవలు…..
బానోత్ లాల్ జీవితం నవభారత్ ఫెర్రో ఎల్ అల్లాయిస్ పాల్వంచ లో 1979 ఉద్యోగ జీవితం మొదలైన 6 నెలలకే అసోసియేషన్ లో ఉపాధ్యక్ష పదవి తో మొదలై తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ లో ఏకంగా వరుసగా 4 సార్లు ఉపాధ్యక్ష పదవి లో కొనసాగారు.1982లో నందమూరి తారక రామారావు కార్మికుని దుస్తులలో ఖమ్మం జిల్లాలో ప్రవేశించినప్పుడు స్వాగతం పలికి వీర అభిమానిగా రక్త తిలకం దిద్ది టిఎన్టియుసి అభివృద్ధికి కృషి చేశారు.1987 లో పాల్వంచ మున్సిపాలిటీకి చైర్మన్ పదవికి మొదట రామారావు కేటాయించగా లోకల్ రాజకీయాల కారణంగా పోటీ నుండి తప్పుకున్నారు.భారజల కర్మాగారం మణుగూరు లో 1989 లో ఉద్యోగంలో చేరడంతో అప్పటి అశ్వాపురం మండల రాజకీయాల్లో యుక్త వయసులో తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేస్తూ పలు పదవుల్లో కొనసాగుతున్న తుళ్లూరి బ్రహ్మయ్య తో చక్కటి స్నేహబంధం ఏర్పడి ఆయన మద్దతుతో భారజల కర్మాగారంలో టీఎన్టియుసి అధ్యక్ష పదవితో మొదలై 2015 లో ఉద్యోగ విరమణ వరకు టి ఎన్ టి యు సి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగాను హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగ అసోసియేషన్ లో 6సార్లు గౌరవ అధ్యక్షులుగా పనిచేశారు.
అశ్వాపురం గ్రామపంచాయతీకి సతీ సమేతంగా వారు చేసిన సేవలు….
బారజల కర్మాగారంలో చేరిన నాటి నుండి నేటివరకు తుళ్లూరి బ్రహ్మయ్య అనుచరుడిగా ఉన్నారు.2013లో అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా సదర్ లాల్ సతీమణి శారదలాల్ సర్పంచ్ గా విజయదుందుభి మోగించారు.2018 లో మరోసారి ఏకగ్రీవ సర్పంచ్ గా బానోత్ శారద ఎన్నిక అయ్యారు. గత సర్పంచుల పదవీకాలంలో అశ్వాపురం గ్రామపంచాయతీలో 10 సిసి రోడ్లు,100 వీధిలైట్లు మాత్రమే ఉండటం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం లాంటివి ఉండగా వారు సర్పంచ్ గా పదవిలో రావటం రెండు దఫాలుగా సర్పంచ్ గా కొనసాగడంతో ఇప్పటివరకు 80 సీసీ రోడ్లు 1600 వీధిలైట్లను వేయడంలో, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం మరియు ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయుటకు వారు చేసిన కృషి అశ్వాపురం భారజల కర్మాగార ఉద్యోగులు పడుతున్న ప్రయాణ కష్టాలు చూసి గ్రామపంచాయతీలో తురుమల గూడెం తండా నుండి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు వేయించడంలో వారి పడ్డ కష్టం ఇప్పటికీ అశ్వాపురం అభివృద్ధిలో వారు ప్రధాన పాత్ర పోషించారనడంలో సందేహం లేదు.
శాసనసభ్యులతో శభాష్ అనిపించుకున్న లాల్…….
పినపాక నియోజకవర్గం లో సతి సమేతంగా పనిచేసిన కాలంలో తాజా, మాజీ శాసనసభ్యులతో చనువుగా ఉంటూ అశ్వాపురం గ్రామపంచాయతీకి నిధులు రావడంలో అభివృద్ధి చేయడంలో వారితో మమేకమై పట్టుబట్టి పనులు చేయించుకున్న సందర్భాల్లో సదర్ లాల్ సాటి లేదు అనుకోవచ్చని శాసనసభ్యులతో శభాష్ లాల్ అనిపించుకున్న సందర్భాలు ఉన్నాయి.
తుళ్లూరి బ్రహ్మయ్య అనుచరుడుగా సర్పంచ్ గా ఎన్నిక….
అశ్వాపురంలో బారజల కర్మాగారంలో ఉద్యోగంలో చేరడంతో ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ లో చురుకుగా తనతైన పాత్ర వేసుకొని ముందుకు వెళ్తున్న తొళ్లూరి బ్రహ్మయ్య తో సన్నిహితం ఏర్పడి సుదీర్ఘంగా 35 సంవత్సరాలు ఆయనతో కలిసి పయనించిన కాలంలో నమ్మిన బంటుగా బ్రహ్మయ్య వద్ద కూడా తనదైన ముద్ర వేసుకున్న లాల్ అనంతరం 2025 సర్పంచ్ ఎన్నికలలో తుళ్లూరి బ్రహ్మయ్య అనుచరుడిగా ఎన్నికలలో పోటీ చేయగా అశ్వాపురం గ్రామపంచాయతీ అభివృద్ధిలో తనదైన పాత్ర వేసుకొని అభివృద్ధి పదంలో నడిపించిన కారణంగా మండల ప్రజలకు సుపరిచితుడుగా, అధికార ప్రభుత్వ వర్గాలు వేరైనా బ్రహ్మయ్య అనుచరు వర్గంతో సర్పంచ్ గా 641 ఓట్ల భారీ మెజార్టీతో గెలవడంతో మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలతో వారి కుటుంబం మరొకమారు అశ్వాపురం గ్రామపంచాయతీకి తనదైన శైలిలో సేవ చేసి ప్రజల రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నారు.
ప్రేమే మార్గం…… సేవే లక్ష్యం….. లాల్ నినాదం
పంచాయతీలోని ప్రజలతో ఆప్యాయంగా పలకరించి ప్రేమగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వారికి సేవ చేసే పనే లక్ష్యంగా భావించి ఎప్పటికీ పంచాయితీలో చెరగని ముద్ర గా లాల్ నినాదం ఉండటమే తన లక్ష్యంగా చేసుకొని మరొక మారు సర్పంచ్ గా తమ కుటుంబం నుండి పదవీ బాధ్యతలు చేపట్టపోతున్న సదర్ లాల్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్న పయనించే సూర్యుడు దినపత్రిక… శుభాకాంక్షలు సదర్ లాల్
