PS Telugu News
Epaper

లిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

📅 26 Feb 2026 ⏱️ 7:19 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,షాద్ నగర్,రాజేంద్రనగర్ నియోజక వర్గానికి చెందిన ముఖ్య నేతలు

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

లిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు పాల్గొన్నారు. శంషాబాద్ లోని లిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం శంషాబాద్ లో మరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు.ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారితో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. షాద్ నగర్ నియోజక వర్గానికి చెందిన అనేక మంది పేదలకు అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన వైద్యం అందిస్తున్న లిమ్స్ యాజమాన్యం మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడం శుభప్రదం అని అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ నియోజక వర్గానికి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Scroll to Top