లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణం కోసం 10 లక్షలు, నిధులు మంజూరు….మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి …
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో మహిళా సంఘ భవనం నిర్మాణం, ప్రొసీడింగ్ కాపీని ఈరోజు అందజేయడం జరిగింది. నిధులు మంజూరు చేసి ఇచ్చినందుకు *మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి .ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల ముత్త గౌడ్, ఉప సర్పంచ్ సురేష్, వార్డు మెంబెర్ మీనాక్షి, vo అధ్యక్షురాలు సరస్వతీ, పోసాని, నాయకులు నర్సారెడ్డి, నహీరు, రాము మరియు తదితరులు ఉన్నారు.
