వరదలపై కాట్రేనికోన తాసిల్దారి కార్యాలయం లో సమీక్షా సమావేశం

August 1, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు ఆగస్టు ఒకటి ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన,భద్రాచలం వద్ద గోదావరి నది మూడో ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో రానున్న సమయంలో దిగువ ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాట్రేనికోన మండలం తాసిల్దారి ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు అనగా 1.8.2026 ఉదయం 10 గంటలకు తహసిల్దార్ రవి కిరణ్ అధ్యక్షతన తహసిల్దార్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదల కారణంగా ముంపు ముప్పు ఉన్న నడవపల్లి, కుండలేశ్వరం, పల్లంకురు గ్రామాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మండల స్థాయి అధికారులకు తహసిల్దార్ ఆదేశించారు. ప్రజలను అప్రమత్తం చేయడం, పునరావాస కేంద్రాలు సిద్ధం చేయడం, సహాయ చర్యలపై సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్, రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సై ఐ అవినాష్, వీఆర్వోలు, సచివాలయ సెక్రటరీలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper