PS Telugu News
Epaper

వసంత పంచమి వేడుకల్లో విద్యార్థులు

📅 24 Jan 2026 ⏱️ 4:37 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఐ పోలవరం మండలం మురముళ్ళ గ్రామంలో నూతనంగా నిర్మించిన సంపూర్ణ శిలా రామ కోవెలలో నడింపల్లి శివరాజు ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భముగా స్థానిక విద్యార్థుల చే సరస్వతి మాతకు సహస్ర కలములతో పూజ నిర్వహించి విద్యార్థులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివరాజు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలి అంటే సరస్వతి మాత సంపూర్ణ అనుగ్రహం లభించాలి అందుకోసమే ఈరోజు ఈ సరస్వతీ పూజా కార్యక్రమం నిర్వహించి అమ్మవారి ప్రసాదంగా పెన్నులు విద్యార్థులకు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం స్వస్తివాచకులు నాగాభట్ల రవి పెన్మెత్స వాసురాజు ఎస్.ఎస్.ఎఫ్.గ్రామ మహిళా కన్వీనర్ నూలు వల్లీతాయారు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top