వామపక్ష కార్మిక సంఘాలు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హోలీ క్రాస్ సర్కిల్ పెట్రోల్ బంక్ నుండి ప్రారంభమై పట్టణ వీధులలో ప్రచారం చేసింది. సిపిఐ సీనియర్ నాయకులు మోదుగుల పార్థసారథి కార్మికుల పోరాటాల విశిష్టతను గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండించారు,. ఏ ఐ టి యు సి పట్టణ కార్యదర్శి నాగేంద్రబాబు మోడీ కేంద్ర ప్రభుత్వం విధానాలను ఖండిస్తూ నాలుగు లేబర్ కోట్ల ద్వారా కార్మికుల హక్కులను పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. పగలు, రాత్రి తేడా లేకుండా 12 గంటలు పనిచేయాలని నిర్బంధ చట్టం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో AITUC మరియు CITU ప్రజా సంఘ నాయకులు కార్మిక సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.