వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన కంచర్ల బాబి
పయనించే సూర్యుడు జనవరి 21 కొత్తపేట
కొత్తపేట ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్య కాపరమేశ్వరి ఆత్మఅర్పణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కంచర్ల వెంకట్రావు (బాబీ) మాట్లాడుతూ స్త్రీల ఆత్మగౌరవానికి ప్రతీకగా వాసవి అమ్మవారు నిలిచారని అటువంటి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం మంగళవారం కొత్తపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కంచర్ల బాబి పాల్గొన్నారు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వారు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాంబాబు గారు ఆయనకి వేద ఆశీర్వచనంచేశారు అనంతరం జరిగిన నిప్పుల గుండం కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు పోశెట్టి సూరిబాబు, వాణిజ్య విభాగం చైర్మన్ లక్కింశెట్టిబాబులు, డాక్టర్ పి కృష్ణారావు, వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు తమ్మన సాయిప్రసాద్, శ్రీఘాకోళ్ళపు బాబి తదితరులు పాల్గొన్నారు
