వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
రాజనగరం లో కొలువైన వాసవీ కన్యకాపరమే శ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం లో ముఖ్య అతిథులుగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు బిజెపి రాజానగరం పూర్వ అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి కమిటీ అధ్యక్షులు రొటేరి యన్ మండవిల్లి వెంకన్నబాబు ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఉదయం గణ పతి పూజ, పుణ్యాహవచనం, మండపారా ధన, అమ్మవారికి 11 రకాల ద్రవ్యాలు, 108 కలశాల నీటితో అభిషేకం, ఊరే గింపు జరిగింది. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. మధ్యాహ్నం గణపతి, నవ గ్రహ, వాస్తుహోమాలు నిర్వహించారు. సాయంత్రం సహస్ర కుంకుమార్చన, శ్రీరుద్రహోమాలు, అమ్మవారి మంత్రహోమం, చండీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. రాజానగరం ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు సముద్రాల రాంబాబు, రొటేరియన్ గ్రంథి రాజా , రాజనగరంపాల్గొన్నా మోదీ సత్తిబాబు, మద్దుల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు
