PS Telugu News
Epaper

విండో మాజీ చైర్మన్ పత్తి రాము ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అల్పాహారం అందజేత….

📅 20 Aug 2025 ⏱️ 2:57 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

1) కూలిన ఇళ్లను పరిశీలిస్తున్న స్థానిక మండల నాయకులు…

2). నిరాశ్రయులకు అల్పాహారం అందజేస్తున్న దృశ్యం…

రుద్రూర్, ఆగస్టు 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)

కురిసిన వర్షాలకు రుద్రూర్ గ్రామంలో బోయి గల్లీ, చాకలి గల్లీలో నివాసపు ఇండ్లలోకి వర్షపు నీరు చేరి నిరాశ్రయులయ్యారు. బుధవారం చాకలి గల్లీ, బోయి గల్లీలో వర్షానికి కూలిన ఇండ్లను పరిశీలించారు. వీరికి విండో మాజీ చైర్మన్ పత్తి రాము, స్థానిక నాయకులు కలిసి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించి, టిఫిన్స్, భోజన వసతులు ఏర్పాటు చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం, మాజీ రైతు సమన్వయ సమితి కన్వీనర్ సంగయ్య, అక్కపల్లి నాగేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పార్వతి ప్రవీణ్, విండో డైరెక్టర్ సుబాని, జమిల్, మాజీ వార్డు సభ్యుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top