విజన్ లో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం….
పయనించే సూర్యుడు న్యూస్ 28
సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీన “నేషనల్ సైన్స్ డే” ను జరుపుకోవడం జరుగుతుందని,ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విజన్ విద్యార్థులు తమ మేధా సంపత్తిని ఉపయోగించి విన్నూత్న ప్రయోగాలతో ఆకట్టుకున్నారు…మొదటగా ఈ కార్యక్రమంలో విజన్ కరస్పాండంట్ విశ్వనాధ్ రామన్ ఎఫెక్టు గురించి మరియు విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ అనగా కాంతి ఒక మీడియం లో ప్రయానించినపుడు అది పరీక్షే పణం చెంది తన మార్గాన్ని మార్చుకుంటూ వివిధ తీవ్రతలు కలిగిన రేఖలను ఏర్పరుస్తుంది అని,అనాడు ఆయన కనుగొన్న రామన్ ఎఫెక్టు ఎంతో మంది శాస్త్రవేత్తల పరిశోధనలో ఉపయోగపడుతోందని, మధుమేహం క్యాన్సర్ వంటి వ్యాధుల జన్యులోపాలను రామన్ ఎఫెక్టు ద్వారా తెలుసుకోవచ్చు అని అలాగే విద్యార్థులు మంచి విలువలతో కూడిన జీవన విధానం ను అలవర్చుకోవాలని ఆయన విద్యార్థులకు వివరించారు…అలాగే వెటర్నరీ డాక్టర్ సుబ్బారెడ్డి గారు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల్లో పురుషోత్తం, పామిశెట్టి రాజు , నిస్సర్,నాని గారు మాట్లాడుతూ ఇక్కడ చేసిన ప్రాజెక్టులు చాలా బాగున్నాయని,అందులో వ్యవసాయంలో సంప్రదాయ ఆధునిక పద్ధతులు, ఎయిర్పోర్ట్,హ్యూమన్ స్కెలిటన్, గుండె, కిడ్నీ ఎనాటమీ,ఇండోర్ గేమ్స్ చాలా ఆకట్టుకున్నాయి అని విద్యార్థులను ప్రశంసించారు…ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు,విజన్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

