PS Telugu News
Epaper

విజన్ లో ఘనంగా నేతాజీ జయంతి వసంత పంచమి వేడుకలు..

📅 23 Jan 2026 ⏱️ 6:45 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

స్థానిక విజన్ విద్యాసంస్థల నందు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుడు “నేతాజీ ” సుభాష్ చంద్రబోస్ జన్మదిన మరియు వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను” అనే నినాదంతో యుద్ధఖైదీలను మరియు తోటకూలీలను ఉత్తేజపరచి “భారత జాతీయ సైన్యం” మరియు ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ ను స్థాపించి ఆంగ్లేయులను దీటుగా ఎదుర్కొన్న గొప్ప ధైర్యశాలి.గాంధీ సిద్ధాంతాలతో విభేదించినా, జర్మనీ (హిట్లర్) మరియు జపాన్ వంటి దేశాలను భారత దేశ స్వాతంత్ర్య సాధనకు మద్దతు కూడబలికి దౌత్య సంబంధాలు మెరుగు పడడానికి కృషిచేసిన గొప్ప వ్యక్తి అని విజన్ కరస్పాండెంట్ విశ్వనాథ్ విద్యార్థులకు వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమం లో విజన్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

Scroll to Top