PS Telugu News
Epaper

విజేత జూనియర్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ సభ్యత్వం క్యాంపియన్

📅 18 Aug 2025 ⏱️ 7:07 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ…..

విస్తృతంగా సభ్యత్వం తీసుకోవాలని విద్యార్థులకు పిలుపు

( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) . అధ్యయనం పోరాటం నినాదాలతో 1970లో ఏర్పడి నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడుతూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నిలుస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు.. అందరికి సమానమైన విద్యా అందించాలన్నారు విద్యార్థుల హక్కుల కోసం సామాజిక న్యాయం, మరియు ప్రగతిశీల భావజాలం కోసం నిరంతరం పోరాడుతున్నది అన్నారు. నిరంతరం విద్యార్థుల కోసం పోరాటాలు నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ సంఘంలో సభ్యులుగా చేరాలని పిలుపు నిచ్చారు. ఎస్ఎఫ్ఐ సభ్యత్వం అనేది విద్యార్థులను ఈ ఉద్యమంలో భాగం చేసే ఒక ముఖ్యమైన అడుగు, విద్యార్థులను సామాజిక, రాజకీయ చైతన్యం చేస్తుంది అన్నారు. ఎస్ఎఫ్ఐ సభ్యత్వం తీసుకోవడం అంటే కేవలం ఒక సంస్థలో చేరడం మాత్రమే కాదు, ఒక ఉద్యమంలో భాగమై, సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయడం. ఈ మెంబర్‌షిప్ ద్వారా విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడటమే కాకుండా, విద్యా వ్యాపారకరణ, కుల వివక్ష, ఆర్థిక అసమానతలు, మరియు మతతత్వం వంటి సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకుంటారు. ఎస్ఎఫ్ఐ సభ్యులు జాతీయ మరియు స్థానిక స్థాయిలో జరిగే ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటారు, ఇది వారి నాయకత్వ లక్షణాలను మరియు సామాజిక బాధ్యతను పెంపొందిస్తుంది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ ఉపాధ్యక్షులు ఆదిల్ మరి ఎస్ఎఫ్ఐ టౌన్ కమిటీ సభ్యులు ప్రవీణ్ చరణ్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top