విత బీమా చెక్కు అందజేత
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 10 ముమ్ముడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) కాట్రేనికోన
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు చెల్లించడం ద్వారా సహజ మరణం పొందిన ఖాతాదారునికి రెండు లక్షల రూపాయల జీవిత బీమా లభిస్తుందని కాట్రేనికోన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జి బి వి రమణ తెలిపారు. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామానికి చెందిన పెయ్యిల దుర్గా రావు ఇటీవల మరణించగా ఆయన భార్య భవానీ కి రెండు లక్షల రూపాయల బీమా చెక్కును శుక్రవారం మేనేజర్ అందించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ జీవిత బీమా, ప్రమాద బీమా పాలసీ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ మహేష్ బాబు,స్టేట్ బ్యాంక్ సిబ్బంది, కియోస్క్ బ్యాంక్ ఆపరేటర్లు పెయ్యల సురేష్ బాబు, పాలెపు సత్యానందం , మల్లాది రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
