PS Telugu News
Epaper

విద్యార్థులు ఉన్నత చదువుల పైన దృష్టి సారించాలి: షి టీమ్ పోలీసులు

📅 02 Apr 2026 ⏱️ 7:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్3 మక్తల్}

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలోని లిటిల్ ఏంజిల్స్ పాఠశాలలో గురువారం షీ టీమ్ పోలీసులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి సమస్యలపై వివరించారు. అలాగే అధికంగా సెల్‌ఫోన్ వినియోగించడం వల్ల కలిగే అనర్థాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఉన్నత చదువులపై దృష్టి సారించాలని సూచించారు.అమ్మాయిలు ఏదైనా వేధింపులకు గురైతే నిర్భయంగా పోలీసులకు షి టీమ్ No. 8713670398 కి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఈ సందర్భంగా షీ టీమ్ కానిస్టేబుల్ బాలరాజు, చేనప్ప లు మాట్లాడుతూ… విద్యార్థులు తమ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో ఏ సమస్యనైనా పంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, షీ టీమ్ పోలీసులు జ్యోతి, కవిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top