PS Telugu News
Epaper

విద్యార్థులు చదువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన జానకిరామ్ రెడ్డి

📅 30 Aug 2025 ⏱️ 7:01 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటివేషన్ తరగతులు

( పయనించే సూర్యుడు ఆగస్టు 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

ప్రగతి వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ, ఆధ్వర్యంలో మధురాపూర్ గ్రామం ఫరూక్నగర్ మండలం రంగారెడ్డి జిల్లా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఎం. జానకిరామ్ రెడ్డి తో కలిసి తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విద్యార్థులు చదువు పట్ల తీసుకోవలసిన మెలుకువలు కష్టపడే తీరు అలాగే విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రుల పట్ల గౌరవం వహించాలని అదేవిధంగా పదో తరగతి ఉత్తీర్ణత కనబరచాలని నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆటల పైన కూడా శ్రద్ధ పెట్టాలని ఇలాంటి స్వచ్ఛంద సంస్థల సహకారం పూర్తిగా మీకు ఉంటుందని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరడం జరిగింది. అలాగే మోటివేషన్ ద్వారా దేశ రక్షణ కోసం పని చేసిన వారి చరిత్రను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతి స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఎడ్యుకేషన్ మేనేజర్ జగదీష్, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మురళి కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Scroll to Top