PS Telugu News
Epaper

విద్యార్థుల కలలపై కాంగ్రెస్ కత్తి..

📅 05 Nov 2025 ⏱️ 6:17 PM 📝 తెలంగాణ
Listen to this article

₹10,500 కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలు..

విద్యార్థుల భవిష్యత్తు చీకట్లోకి నెడుతున్న ప్రభుత్వం..

బీజేపీ నాయకుడు పసుపుల ప్రశాంత్

( పయనించే సూర్యుడు నవంబర్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

తెలంగాణలో ఉన్నత విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందని బీజేపీ నాయకుడు పసుపుల ప్రశాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన మాట్లాడుతూ “రాష్ట్రంలోని వేలాది కాలేజీలు మూతబడే దశకు చేరుకున్నాయి. కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను సంవత్సరాలుగా విడుదల చేయకపోవడమే. ₹10,500 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో కాలేజీలు నడపలేని స్థితిలోకి చేరాయి. మేనేజ్‌మెంట్లు నిధుల కోసం తంటాలు పడుతుండగా, ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తోంది.”“పేద విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. హాస్టల్ ఫీజులు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వకపోవడంతో వారు కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇదేనా ప్రజల ప్రభుత్వం? విద్యార్థుల కన్నీళ్లు కూడా కనబడకపోతే ఆ ప్రభుత్వానికి మిగిలేది అవినీతి మచ్చే!” అని పసుపుల ప్రశాంత్ తీవ్రంగా విమర్శించారు.“వెంటనే ₹10,500 కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి తెలంగాణ రాష్ట్రంలో 2,500 విద్యాసంస్థలు మూతపడటం దారుణమని పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వం.విద్యా రంగంపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదు. బీఆర్‌ఎస్ పాలనలోనే విద్యా వ్యవస్థ బలహీనపడింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిని మరింత దారుణ స్థితికి తీసుకెళ్తోంది. పేద పిల్లల విద్య, ఉపాధ్యాయుల భద్రత, ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై వెంటనే చర్యలు తీసుకోవాలని” ఆయన డిమాండ్ చేశారు.

Scroll to Top