
యువతకు నైపుణ్యంతో ఉపాధి కల్పనపై కూటమి ప్రభుత్వ
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోని కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్( కె ఐ ఈ టి )కళాశాలను ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం,రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు,ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు)తో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థుల విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు,ప్రభుత్వ నియామకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ యువత ఎదుర్కొంటున్న అంశాలపై చర్చించారు.ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ విస్తృత అవకాశాలు అందుబాటులోకి వచ్చేలా పరిశ్రమలు, ప్రముఖ కంపెనీలతో అనుసంధానం పెంచి యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు అవసరమని వివరించారు.పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసి,క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు,నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడంపై దృష్టి సారించారు. చదువుతో నైపుణ్యం..నైపుణ్యంతో ఉపాధి..ఉపాధితో ఉజ్వల భవిష్యత్తు అనే లక్ష్యంతో యువతలో విశ్వాసాన్ని పెంపొందించేలా ఇటువంటి ప్రత్యక్ష సమావేశాలు కొనసాగుతున్నాయన్నారు.యువత ఆశయాలను తెలుసుకుని,వారి ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.