విద్యార్థుల మధ్య ఘనంగా బండి రమేష్ జన్మదిన వేడుకలుకేపీహెచ్‌బీలో కేక్ కట్, చేసి అన్నదానం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ | జూలై 15 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెం.2లోని మందల అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో విద్యార్థుల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేపీహెచ్‌బీ వసంతనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందలపు సాయిబాబు చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారులతో ఆప్యాయంగా మమేకమై వారికి భోజనం వడ్డిస్తూ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పర్చూరి మురళి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం బండి రమేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే ప్రజానాయకుడని, ప్రజాబాంధవుడని కొనియాడారు. అలాంటి నాయకుడి జన్మదినాన్ని పాఠశాల చిన్నారుల మధ్య నిర్వహించడం ఆదర్శప్రాయమైన కార్యక్రమమని అన్నారు.అలాగే మందలపు సాయిబాబు చౌదరి గత 22 సంవత్సరాలుగా ప్రజాసేవలో కొనసాగుతూ ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులతో సహపంక్తి భోజనాలు నిర్వహించడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనమని పర్చూరి మురళి ప్రశంసించారు. ఈసారి బండి రమేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల దేశాల్, గేదెల అనిల్, సంజయ్ రావు, డాక్టర్ రాఘవేంద్ర రావు, మల్లిబాబు, రమణ, విద్యాసాగర్, భీమేశ్వర్ చౌదరి, కాజా నవీన్, కృష్ణ, విజయసారథి, గంగాధర్, పండు, యువ నాయకులు రాము, త్రినాథ్, బాలాజీ, సురేష్, సత్తార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.“ప్రజల మధ్యే నాయకుడి పుట్టినరోజు… చిన్నారుల చిరునవ్వుల్లో సేవకు సార్థకత” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికంగా విశేష ఆదరణ పొందింది. బండి రమేష్‌కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.