PS Telugu News
Epaper

విద్యావంతుడికి అవకాశం ఇవ్వండి

📅 09 Dec 2025 ⏱️ 6:48 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

గంగన్నగూడ సర్పంచ్ అభ్యర్థి చిట్టెం లక్ష్మీకాంత రెడ్డి తరఫున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న

బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈరోజు కొందుర్గు మండలం గంగన్నగూడలో బిజెపి అభ్యర్థి చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీకాంత్ రెడ్డి మంచి విద్యావంతుడు, సౌమ్యుడు, నీతి నిజాయితో పనిచేసే వ్యక్తి కనుక బ్యాట్ గుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిట్టెం సత్యనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గట్టుపల్లి యాదయ్య, పత్తి శ్రీనివాస్, నరసయ్య, చంద్రశేఖర్, నరసింహారెడ్డి, భారీ సంఖ్యలో యువత, మహిళలు పాల్గొన్నారు.

Scroll to Top