విద్యుత్ ఉద్యోగులను ముందస్తు అదుపులోకి తీసుకున్న ఏన్కూర్ పోలీసులు.
పాల్వంచ కేటీపీఎస్ దగ్గర విద్యుత్ ఉద్యోగులు ధర్నా.
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్, గత కొంతకాలంగా విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్హతను బట్టి ఆర్టీషన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, అన్ని అర్హతలు ఉండి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయాలని తదితరు డిమాండ్లతో సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులను పాల్వంచలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనకుండా ఏన్కూరు ఎస్సై సంధ్య వాహనాలు తనిఖీ చేసి ముందస్తు చర్యలో భాగంగా ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

