PS Telugu News
Epaper

విమర్శలకు ఆధారాలతో సమాధానమిచ్చేందుకు సిద్ధం అన్న కవిత

📅 10 Dec 2025 ⏱️ 4:20 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు  చేసిన విమర్శలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమాధానం ఇచ్చారు. నేను ఆధారాలతో సహా సమాధానం చెప్తానని ప్రకటించారు. కావాలనే పర్సనల్ ఆటాక్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్‌ బయటపెట్టిందని చురకలు వేశారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు. కూకట్ పల్లి 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే నేను చెప్పనున్నట్లు వెల్లడించారు. కృష్ణారావు మాట్లాడిన మాటాలకు ఫీలయ్యేది లేదని, ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ఐదు రోజుల పాటు పర్యటించనున్నట్లు తెలిపారు.  ప్రస్తుతం కంటోన్మెంట్‌లోని బోయినపల్లి గవర్నమెంట్ స్కూల్ లో ఉన్నామని, మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్ ను బాగు చేశారన్నారు. కానీ కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాలు లేవన్నారు. వాటిని మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు.అలాగే ఈ స్కూళ్లోనే అంగన్ వాడీని కూడా కలిపారని, కానీ అంగన్ వాడీలో హెల్పర్లు లేరని చెప్పారు. జనం బాటలో భాగంగా విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టామన్నారు. పాఠశాలలతో పాటు ఆస్పత్రిలో వసతులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా, ఇల్లు, ఇళ్ల పట్టాలను లేని వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నామన్నారు. జనం బాటలో చేయగలిగేది మేము ఒక సంస్థగా చేస్తామని హామీ ఇచ్చారు.అంతేకాకుండా టాప్ మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తామన్నారు.  ప్రభుత్వం సాధించే వాటిని కూడా చేయిస్తామన్నారు.  ప్రజల సమస్యలను వీలైనంతగా మేము పరిష్కరిస్తామన్నారు.గత ప్రభుత్వంలో కేవలం నిజామాబాద్ కే పరిమితం చేశారన్నారు.  అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదన్నారు. తెలంగాణ వచ్చాక ఏం జరిగింది. ఏం జరగలేదన్నది జనం బాట కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.  సమస్యలపై ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం పట్టించుకోవడం లేదని,  అందుకే జాగృతి జనం గళమై పనిచేస్తోందన్నారు.



Scroll to Top