PS Telugu News
Epaper

“విశాఖలో దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్!”

📅 01 Dec 2025 ⏱️ 4:26 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :పర్యటకులకు గుడ్‌న్యూస్. ఏపీలోని విశాఖపట్టణంలో దేశంలోనే అతిపొడవైన గ్లాస్ బ్రిడ్జి ప్రారంభమైంది. కైలాసగిరిపై నిర్మించిన ఈ గాజు వంతెనను వీఎంఆర్‌డీఏ, ఆర్‌జే అడ్వెంచర్స్ సంస్థ సంయుక్తంగా రూ.7కోట్లతో నిర్మించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జి డిజైన్ చేశారు. ఇది పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని విశాఖపట్టణం ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తోపాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

Scroll to Top