PS Telugu News
Epaper

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్,విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ

📅 30 Sep 2025 ⏱️ 1:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

దుర్గామాత కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలి

భజరంగ్ దళ్ నారాయణ పేట జిల్లా సహా సంయోజక్ భీమేష్

భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆయుధపూజ హాజరైన బజరంగిలు

{పయనించే సూర్యుడు} {సెప్టెంబర్ 30} మక్తల్

దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్న భజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ భీమేష్, సభ్యులు దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ,సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని భజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ భీమేష్ ఆకాంక్షించారు. మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చత్రపతి శివాజీ నగర్ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద భజరంగ్ ప్రఖండ సంయోజక్ రాహుల్ ఆధ్వర్యంలో ఆయుధ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ భీమేష్,హాజరై ప్రత్యేక పూజలు, అనంతరం ఆయుధపూజ, నిర్వహించారు,ఈ కార్యక్రమంలో ప్రఖండ సహ సంయోజక్ మూర్తి, నాగరాజ్, అక్షయ్,వంశీ, అరవింద్,విశాల్,ఆనంద్ నిర్వాహకులు పాల్గొన్నారు.

Scroll to Top