విశ్వ హిందూ పరిషత్,బజరంగ్ ఆధ్వర్యంలో ఘనంగా వ్యాస పూర్ణిమ
:పయనించే సూర్యుడు జులై 30మక్తల్ : నారాయణపేట జిల్లా స్థానిక మక్తల్ మండలం పసుపుల గ్రామం శ్రీ దత్తాత్రేయ టెంపుల్ నిత్య పరిపూర్ణానంద స్వామి,కృష్ణ మండలం టైరోడ్ ఓంకార్ ఆశ్రమం వ్యాస పూర్ణిమ సందర్భంగా ఓంకార్ ఆశ్రమ పీఠాధిపతి ఓంకార నంద స్వామిని విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ భీమేష్, ప్రఖండ సంయోజక్ రాహుల్, ఘనంగా సన్మానించడం జరిగింది 84 లక్షల జీవరాసుల్లో మానవ జన్మ ఉత్తమమైనది అని మానవ జన్మంలో గురువుల సాధుసంతుల సాంగత్యం ఎంతో అవసరం ఉందని వారి ద్వారా మోక్ష ప్రాప్తి జరుగుతుందని ప్రతి ఒక్క ప్రాణిని నీ పరమాత్మగా భావించి ప్రతి ఒక్క ప్రాణి పట్ల దయగలి ఉండాలని సనాతన హిందూ ధర్మం నేర్పుతుందన్నారు ఇది ఒక ధర్మమని ఇది ఒక మతం కాదని ధర్మమని అన్నారు ఏ అన్య మతాలకు ప్రార్థన మందిరాలు ఒకే విధంగా ఉంటాయి అవి వారి యొక్క మత చిన్నాలను చూపిస్తుంటాయి ఈ హిందూ ధర్మంలో ఏ ఒక్క ప్రార్థన మందిరాలు ఒకే విధంగా ఉండవని వివిధ రకాలుగా ఉంటాయని కనుక ఇది హిందూ ధర్మం అని ఇది ఒక మతం కాదని వారు అన్నారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆశ్రమం భక్తులు తదితరులు పాల్గొన్నారు.