వెంటనే మున్సిపల్ ఎన్నికలు రేవంత్ రెడ్డి దూకుడు
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం ముగిసిపోయే నాటికి మొత్తం ఇతర మున్సిపల్ సహా..గ్రేటర్ పాలక వర్గానికీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆలస్యమయ్యే కొద్దీ సమస్యలు వస్తాయని.. నిర్వహించేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అన్ని మున్సిపాల్టీల్లోని కాంగ్రెస్ నేతలకు..ఎన్నికలకు సిద్ధం కావాలని సమాచారం వెళ్లినట్లుగా చెబుతున్నారు. మున్సిపాలిటీ కార్యవర్గాల పదవి కాలం ముగిసి ఏడాది మున్సిపాలిటీల కార్యవర్గాల పదవి కాలం ముగిసి ఏడాది అవుతోంది. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి. ఫిబ్రవరి వరకూ గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం గడువు ఉంటుంది. చట్టబద్ధంగా గడువు ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పరిపాలనాపరమైన కారణాల వల్ల నిర్ణయం తీసుకోలేదు. బీసీ రిజర్వేషన్ల అంశంతో ప్రభుత్వం రాజకీయం చేయడంతో.. ఎన్నికల నిర్వహణ పెండింగ్ పడిపోయింది. ఆ అంశం తేలే అవకాశం లేకపోవడంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ ఎన్నికలునిర్వహించారు. ఇప్పుడు అదే