PS Telugu News
Epaper

వెంటాడుతున్న యూరియా కష్టాలు రైతులకు

📅 09 Sep 2025 ⏱️ 8:51 AM 📝 తెలంగాణ
Listen to this article

యూరియా కొరకు బారులు తీరిన రైతులు

పయనించే సూర్యుడు: సెప్టెంబర్ 9 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్ )మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఉదయం నుండి ఎండలో నిలబడి ఒక సంచీ యూరియా కోసం వేచి చూస్తున్న దృశ్యం గ్రామీణ ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది.విత్తనాలు వేసిన పంటలకు ఎరువులు తక్షణం అవసరం అయిన పరిస్థితుల్లో, రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి రావడం రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఎరువు దొరకక పంటలు ఎండిపోతాయనే ఆందోళనలో రైతులు ఉన్నారు. పోలీస్ బందోబస్తు మధ్యన ఒక సంచీ కోసం ఇంతలా కష్టాలు పడాల్సిన పరిస్థితి రావడం పట్ల రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు, రైతు భీమా అంటూ నినదిస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడు రైతు సమస్యలు వినిపించడం లేదని రైతులు మండిపడుతున్నారు.ప్రభుత్వం తక్షణమే యూరియా సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పంటలు దెబ్బతిని రైతాంగం మరింత ఆర్థిక కష్టాల్లో పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Scroll to Top