వెటర్నరీ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని కోరిన ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో షాద్ నగర్ నియోజక వర్గంలో పని చేస్తున్న వెటర్నరీ వైద్యులతో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…షాద్ నగర్ లో పోస్టింగ్ తీసుకొని డిప్యుటేషన్ పై ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగుల డిప్యుటేషన్ లను వెంటనే రద్దు చేయాలని జిల్లా వెటర్నరీ అధికారి శ్రీనివాస్ రావు ను ఆదేశించారు. నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న 22 వెటర్నరీ అసిస్టెంట్ ఖాళీలను వెంటను భర్తీ చేయుటకు రాష్ట్ర మంత్రివర్యులు వాకాటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్తాను అని అన్నారు.అదేవిధంగా దశల వారీగా వెటర్నరీ బిల్డింగ్ ల మరమ్మత్తు చేస్తామని హామీ ఇచ్చారు.
