PS Telugu News
Epaper

వేల్పూర్ మండల కేంద్రంలో ఐకెపి సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఇందిరామ్మా నూతన గృహప్రవేశ

📅 13 Apr 2026 ⏱️ 6:48 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

*రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వేల్పూర్ గ్రామంలో రామన్నపేట గ్రామంలో సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది అక్లూర్ గ్రామంలో ఇందిరమ్మ నూతన గృహప్రవేశాలలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐకేపీ సొసైటీ వరి కొనుగోలు కేంద్రాన్ని వేల్పూర్ గ్రామంలో మరియు రామన్నపేట్ గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమైన నిర్ణయం తీసుకొని సహకార సంఘాలతో సమానంగా మహిళా సమైక్యలకు కూడా కొనుగోలు కేంద్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా రామన్నపేట్ ఐకెపి సెంటర్ రావడం జరిగింది రైతులకు తెలియజేయునది ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలు మ్యచార్ కి అనుకూలంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించాలని సెంటర్ సిబ్బందికి కోరడం జరిగింది అదే విధంగా రైతులు కూడా సమన్వయంతో సీరియల్ నెంబర్ వైస్ గా ఎలాంటి అల్లరి లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని దళారుల చేతికి చిక్కకుండా రైతులు సెంటర్లోనే అమ్మాలని విజ్ఞప్తి చేస్తునం ఈ ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా గతానికి భిన్నంగా పూర్తి గింజను కూడా కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నాం కాబట్టి జిల్లా వ్యాప్తంగా రైతాంగం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకొని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తో పాటు ఎలాంటి దళారుల చేతిలో నష్టపోకుండా ముందుకెళ్లాలని కోరారు అదేవిధంగా రైతులు అడగకముందే రైతుల పక్షపతి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఎల్లప్పుడూ ప్రతి దినం రైతుల కాంక్షను ఆశించే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ వీరిద్దరు సారథ్యంలో ఈరోజు ఈ రాష్ట్రంలో మాక్కల కొనుగోలు కేంద్రాలను గురించి రైతు ఆలోచించకుండా ముందే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మక్కా రేటు తగ్గకుండా దళారులు రైతులను మోసం చేయకుండా ప్రయత్నించేందుకు ఈ నిజాంబాద్ రైతన్న పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడమైనది వినోద్ -కృష్ణవేణి అబూజార్ -ఆసియ ఆరోల్ల సునీత నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటి విడతగా ఇచ్చిన పార్టీతో అనుబంధం ఉన్నవారు కాకుండా గ్రామంలో ఇల్లు లేని వారికి ఎంతమంది ఉన్నారో వారిని సెలక్షన్ చేసి ఇల్లు ఇస్తున్నా ప్రభుత్వం ఇది. గత 75 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేదు. భూమున్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకునే కార్యక్రమంలో ఇల్లు కట్టుకోడానికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడిన స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులు సమస్య పరిష్కరించి ఇల్లు పూర్తి చేయడానికి పూర్తి సహకారం అందజేస్తున్నాం త్వరలోనే మళ్లీ ప్రతి నియోజకవర్గానికి 3500 ఈ అభివృద్ధికి నిదర్శనం సర్పంచ్ ఎన్నికలు గాని మున్సిపాలిటీ ఎన్నికలు గాని తెలియజేశాయి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల రూపాయలతో పాటు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు మరియు మహిళలకు బస్సులు ఫ్రీగా అంతేకాకుండా ఈరోజు మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది గతంలో 10 సంవత్సరాలు రేషన్ కార్డుల గురించి స్థానిక ఎమ్మెల్యే ప్రతి విలేజ్ లో రేషన్ కార్డు ఇస్తున్నమని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి వైస్ చైర్మన్ నర్సారెడ్డి డైరెక్టర్ రవి ముప్కాల్ మండల ప్రెసిడెంట్ ముత్తం రెడ్డి రామన్నపేట్ రమణ సర్పంచ్ నవీన్ ఉపసర్పంచ్ గోవర్ధన్ ఐకెపి సునీత గంగామణి లక్ష్మి సిసి రాధా మురళి అకౌంటెంట్ మహేష్ మాణిక్యరావు కవిత మన రంజని కుకునూరు గ్రామ సర్పంచ్ భూమా రెడ్డి అక్లూర్ సర్పంచ్ జనర్దన్ ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి పడగల్ గ్రామ సర్పంచ్ రాజు జానకంపేట ఉపసర్పంచ్ వినోద్ కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి చిన్నయ్య శోభన్ రెడ్డి మహేందర్ రాజేందర్ మల్లేష్ దాము మల్లన్న ఇంద్ర గౌడ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top