PS Telugu News
Epaper

వైయస్సార్సీపి తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఎలవూరు రమణయ్య నియామకం

📅 18 Oct 2025 ⏱️ 2:07 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ (అక్టోబర్.18/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్

వరదయ్యపాలెం మండలం తొండూరు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలాఊరు రమణయ్య ను తిరుపతి, చిత్తూరు జిల్లాల వైయస్సార్సీపి ఎస్సీ సెల్ విభాగం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఆ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈ సందర్భంగా ఆయనను సత్యవేడు నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పెద్దిరెడ్డి మల్లికార్జున రెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు బందిల సురేష్, నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గిరి రెడ్డి, నాయకులు శ్రీను రెడ్డి, సుబ్రమణ్యం యాదవ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సామర్లహరి, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ తనకు జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన నూకతోటి రాజేష్, రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు నాయుడు దయాకర్ రెడ్డి, ఇతర మండల నియోజకవర్గ నాయకులకు అభిమానులకు ఆత్మీయులకు ప్రత్యేక పాదాభివందనములు తెలియజేస్తున్నట్లు తెలిపారు.సార్వత్రిక ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గంలో నుకతోటి రాజేష్ గెలుపుకోసం తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Scroll to Top