వైయస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుబిడ్డ వైయస్ షర్మిల రెడ్డి జన్మదిన వేడుకలు
పయనించే సూర్యుడు డిసెంబర్ 17 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట నియోజకవర్గంలో, పేట బస్టాండ్ ఆవరణంలో డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, మరియు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహాల కూడలిలో, గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ అంద్రప్రదేశ్ రాష్ట్ర APCC ప్రెసిడెంట్ శ్రీమతి YS షర్మిలా రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి కార్యకర్తలు, మరియు యావన్మంది అభిమానుల సందోహంలో తియ్యటి వేడుకజరుపుకోవడమైనది.ఈ కార్యకమాన్ని శ్రీ యెస్. సునీల్ రెడ్డి సూళ్లూరుపేట టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, గౌరవనీయులు డిసిసి బాలగురవంబాబు అదుపాజ్ఞలకు లోబడి నిర్వహించడమైనది.
ఆంధ్ర రాష్టంలో కష్టకాలంలో పార్టీని తన శక్తీమేరకు నడిపించడంలో సఫలీకృతమై, పాలకవర్గాలకు ముచ్చెమటలు పట్టించేట్టు రాజ్యాంగబద్ధంగా సమస్యలపై తన సద్విమర్శలతో పోరాడుతూ, ప్రజలకన్నియడలా చేదోడువాదోడుగా ఉంటూ, మరియూ ఏఐసిసి చేసే పోరాటలకు ఊతమిస్తూ, “రాజ్యాంగపరిరక్షణలో” తన సత్తా చాటుతూ, “ఓట్ చోరీ గద్దీ చోడ్” కార్యక్రమంలో రాష్ట్రంనుంచి ఎన్నో సంతకాలను సేకరించి రాహుల్గాంధీకి మద్దతివ్వడంలో కూడా ముమ్మరంగా పని చేసి విజయదుందుబి మోగిస్తున్నారు. కేంద్రంలో ఉన్న అసమర్ధపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కూడా వెనకడుగు వేయని, మడమతిప్పని, రాజాశేఖర్ రెడ్డి ముద్దుబిడ్డ షర్మిలమ్మకు పలువురు తన పుట్టినరోజు సందర్భంగా నీరాజనాలిచ్చారు. జేజేలు పలికారు ఈ సంధర్భంగా శిబిరంలో అందరూ ఆమె జన్మదినాన్ని సహృదయంతో సెలెబ్రేట్ చేసుకొన్నారు.ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మా దేవదానం, తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ, సూళ్లూరుపేట నాయకులు యాసిన్ భాషా, గురప్పా తదితర అభిమానులు కార్యకర్తలు కలసి జన్మదిన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
