PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

చిరుతపై చిన్నారి పోరాటం—అద్భుతంగా ప్రాణాపాయం తప్పిన ఘటన!

పయనించే సూర్యుడు న్యూస్ :మహారాష్ట్రలో ఓ 11 ఏళ్ల విద్యార్థి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా చిరుత పులి వెంబడించింది. భయంతో వణికిపోకుండా ఆ బాలుడు తన స్నేహితుడి సహాయంతో చిరుత పులి పై రాళ్లు విసురుతూ, గట్టిగా అరుస్తూ చిరుత దాడిని తిప్పికొట్టాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన జరిగింది. పద్విపాడు ప్రాంతంలో మయాంక్ కువారా.. తన స్నేహితుడితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మయాంక్‌పైకి చిరుత దూకింది.. అతని వీపుపై ఉన్న […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

“నా పెళ్లికే నేనే వెళ్లలేకపోతున్నా!”—పెళ్లికుముందు ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న యువకుడు

పయనించే సూర్యుడు న్యూస్ : ఇండిగో విమానాల రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఎయిర్ పోర్టుల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ అనూహ్య అంతరాయం వల్ల పెళ్లి పనుల మీద వెళ్లాల్సిన వధూవరులు వారి కుటుంబాలు అనుకోని కష్టాల్లో చిక్కుకున్నారు. ఒక జంట వీడియో కాల్ ద్వారా తమ వివాహ రిసెప్షన్‌కు హాజరు కాగా మరికొందరు వేడుకలను రద్దు చేసుకునేందుకు లేదా తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు పరుగులు

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ప్రపంచంలో ప్రత్యేకత సాధించిన కిందపడని జలపాతం—పర్యాటకుల్లో ఆసక్తి పెరుగుతోంది

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రపంచంలో లెక్కలేనన్ని జలపాతాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు ఆకాశమంత ఎత్తు నుండి కిందకు జాలువారుతాయి. కానీ, ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన జలపాతాలలో మోకోనా జలపాతం ఒకటి. దీనిని యుకుమా జలపాతం అని కూడా పిలుస్తారు. అర్జెంటీనా, బ్రెజిల్ సరిహద్దులో ఉన్న ఈ జలపాతం నదికి సమాంతరంగా 3 కిలోమీటర్లు ప్రవహించి, అకస్మాత్తుగా లోతైన లోయలో అదృశ్యమవుతుంది. ఉరుగ్వే నదిపై ఉన్న ఈ జలపాతం సంవత్సరానికి 150 రోజులు అదృశ్యమవుతుంది. మోకోనా జలపాతం ప్రపంచంలోని

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

సముద్రతీరంలో అకస్మాత్తుగా ఎగిసిపడ్డ మంటలు—పడవలు వరుసగా దగ్ధం!

పయనించే సూర్యుడు న్యూస్ : భారీ అగ్నిప్రమాదం పదికి పైగా పడవలను బూడిద చేసింది. ఉన్నట్లుండి చెలరేగిన మంటలతో బోట్లన్నీ దగ్ధమయ్యాయి. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని అష్టముడి సరస్సులో లంగరు వేసిన పదికి పైగా ఫిషింగ్ బోట్లు ఒక పెద్ద అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఒక పడవలో సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని, భారీ ఎత్తున మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు.

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఆయాసంతో విలవిలలాడిన చిన్నారి–స్కాన్‌లో బయటపడిన భయానక నిజం

పయనించే సూర్యుడు న్యూస్ :మూడేళ్ల పిల్లాడికి వారం రోజులుగా తరచూ దగ్గూ, ఆయాసం రావడంతో తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులకు తిరిగారు. అయినా పిల్లాడికి ఎంతకూ ఆయాసం తగ్గడం లేదు. రోజు రోజుకీ పరిస్థితి విషమిస్తుండటంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఊపరితిత్తులకు స్కాన్ చేయగా.. అందులో కనిపించింది చూసి స్టన్‌ అయ్యారు. ఇంతకీ స్కాన్‌ రిపోర్టులో ఏం వచ్చిందంటే.. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రశాంత్‌ అనే వ్యక్తికి మూడేళ్ల కుమారుడు పాలెం మహి (3)

Scroll to Top