వ్యాపార సిండికేట్ కుట్రలో భాగంగా ఎర్రజొన్న,,, పసుపు ధరలు తగ్గింపు పై ప్రభుత్వం స్పందించాలి.
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్
ఎర్రజొన్న… మొక్కజొన్న ప్రభుత్వమే కొనుగోలు చేయాలి… అఖిలభారత ఐక్య రైతు సంఘం. ఏ ఐ యు కె ఎస్ రాష్ట్ర అధ్యక్షులు. .వి ప్రభాకర్. కార్యదర్శి. బి. దేవారం ల డిమాండ్ అఖిలభారత ఐక్య రైతు సంఘం. ఏ ఐ యు కె ఎస్.నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్ లో పాత్రికేయ మిత్రుల సమావేశం 12 మార్చ్ 20 26 రోజున నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్. కార్యదర్శి. బి . దేవారం. లు మాట్లాడుతూ మా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మొక్కజొన్న ఎం ఎస్ పి.. ధర చెల్లించకుండా వ్యాపారులు కృత్రిమంగా 1600 చొప్పున కొనుగోలు చేస్తున్నారని.. అంతేకాకుండా ఆర్మూరు ప్రాంతంలో ఎర్రజొన్నలను వ్యాపారులు చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ధరను క్వింటాల్‌కు 800 నుంచి 1000 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని , వ్యాపారులపై చర్య తీసుకుని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనిఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి.. పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ. మహేష్ కుమార్ గౌడ్ కి విజ్ఞాపన పత్రాలు సమర్పించడం జరిగింది….ఎర్రజొన్న మార్చి 15వ తేదీ లోపే మార్పిడి ద్వారా కొనుగోలు చేయకుండా చివరికి కొనుగోలు చేస్తే దళారీలకే ఉపయోగపడుతుందని గుర్తు చేశారు.. ఎర్రజొన్నలను ఎగుమతులు నిలిచిపోయాయని వ్యాపారులు ఒక సాకు చూపించి క్వింటాలకు 800 నుండి 1000 రూపాయలు కృత్రిమంగా ధర తగ్గించడం రైతులకు వేలాది రూపాయల నష్టం చేసే విధంగా తమ చర్యలు ఉన్నాయని వీరిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో సైతం ఎర్రజోన్లు మేమే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు… అందుకని మొక్కజొన్న,, ఎర్రజొన్న 4000 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని, డిమాండ్ చేశారు…
మోడీ సర్కార్ అధికారంలో రాకముందు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరిపి రెండింతల ఆదాయం తెచ్చి పెడతానని కోతలు కోసిన మోడీ కార్పోరేట్ భజన చేస్తున్నారని ఎం ఎస్ పి అమలు చేయకుండా నేరుగారుస్తున్నారని ఎద్దేవ చేశారు..అమెరికా భారత్ వాణిజ్యము ఒప్పందం నీ ఇంటికి వస్తే ఏం పెడతావని, నా ఇంటికి వస్తే ఏం తెస్తావని చందంగా ఉందని, 11% పైగా ఉన్న దిగుమతి సుంకాలు రద్దుచేసి, ఎగుమతి సుంకాలను 50 శాతం అంగీకరించి దాన్ని తగ్గించామని సంకలు గుద్దుకునే మోడీ భక్తుల్లారా ఆలోచించండి… దిగుమతి సుంకాల జీరో చేసినప్పుడు ఎగుమతి సుంకాల జీరో చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు…వాణిజ్య ఒప్పందం రైతు వ్యతిరేకంగా ఉందని దీని రద్దు చేయాలని స్వామినేతను కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు…కలెక్టర్ చొరవ తీసుకొని వ్యాపార, రైతు, రైతు సంఘాల ప్రతినిధులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు,ఈ సమావేశంలో.. నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి. బి. కిషన్. ఆర్మూర్ డివిజన్. అధ్యక్షులు. ఆకుల. గంగారాం. ఉపాధ్యక్షులు.. యు రాజన్న. నాయకులు. లింబాద్రి. తదితరులు పాల్గొన్నారు…
