PS Telugu News
Epaper

శత్రిశూల స్నాన మహోత్సవం…

📅 17 Feb 2026 ⏱️ 4:37 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరులో వేంచేసియున్న శ్రీ భట్టి విక్రమార్కేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలమూరు పెద్ద కాలువ వద్ద శైవాగమశాస్త్రోక్తంగా కళ్యాణ బ్రహ్మ గార్డైన స్థానిక బ్రహ్మశ్రీ వెలవలపల్లి కృష్ణ చైతన్య శర్మ గారి బ్రహ్మత్వంలో అర్చకులు పెద్దపళ్ళ సీతారామశాస్త్రి గారు మరియూ ఆలయ ప్రధాన అర్చకులైన టీటీడీ వార్షిక సత్కార పండిత బ్రహ్మశ్రీ కాళ్ళకు సూరి పండు శివాచార్య వారి సారధ్యం లో భక్తిశ్రద్ధలతో సుమారు కిలోమీటరన్నర కాలినడకన పెద్ద కాలువ వద్దకు వచ్చి స్వామివారిలో త్రిశూల స్నానం లో పాల్గొన్న ఆలమూరు గ్రామస్తులు మరియు మహిళా భక్తులు…. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సూరి పండు మాట్లాడుతూ ” అస్త్రతీర్థం మహాతీర్థం త్రిషులోకైక పావనం, పుణ్యాత్ పుణ్యతరం తీర్థం మంగళానాంచ మంగళం! అని వివరిస్తూ బ్రహ్మ విష్ణు శివ లోకాలను సైతం పావనం చేయగల పవిత్రత విష్ణు కళ్యాణంలో చక్రవారికి శివకళ్యాణం లో త్రిశూల స్నానానికి మాత్రమే ఉన్నాయి అని తెలియజేసిరి!… ఈ ఏర్పాట్లన్నీ స్థానిక ఆలయ కార్యనిర్వహణాధికారి వారు నరేంద్ర కుమార్ గారు పర్యవేక్షణలో నిర్వహించిరి…

Scroll to Top