శాశ్వత పరిష్కారం అవసరమన్నకూనవరం స్ట్రెయిట్ కట్ పునరుద్ధరించాలిప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు
పయనించు సూర్యుడు మార్చ్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం& ముమ్మిడివరం నియోజకవర్గం ల పరిధిలోని కూనవరం మొగ( స్ట్రైట్ కట్ ) పునరుద్ధరించాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు గురువారం అసెంబ్లీలోకోరారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇచ్చిన అవకాశం మేరకుఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి ఏటా జిల్లా కలెక్టర్ తో చర్చించి మొగను పునరుద్ధరిస్తున్నామని, అయితే మరల ఇది మూసుకుపోతుందని దీనికి శాశ్వత పరిష్కారం లో భాగంగా ఇరువైపులా రివీట్ మెంట్ అవసరమనిదాట్ల ప్రతిపాదించారు. మత్స్యకారులు తమ జీవన ఉపాధి అయిన చేపల వేటనుకోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొగ మూసుకుపోవడం వల్లపర్ర లోకి నీరు రావడంలేదని, దీనికి తోడు కొంతమంది పర్ర భూములు అక్రమ ఆక్వా చెరువులను సాగు చేస్తున్నారనిఎమ్మెల్యే వివరించారు. ముమ్మిడివరం అమలాపురం పరిధిలో ఉన్న ఈ అక్రమ ఆక్వా చెరువులను ధ్వంసం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇప్పటికే బాధ్యత మత్స్యకారులు మగ విషయమై నిరసన వ్యక్తం చేసిన విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే దాట్ల వివరించారు.